ఇంటర్‌ అడ్మిషన్లపై అపోహలొద్దు - ఆర్‌ఐవో

ABN , First Publish Date - 2020-10-31T10:10:05+05:30 IST

ఇంటర్‌ అడ్మిషన్లపై అపోహలొద్దు - ఆర్‌ఐవో

ఇంటర్‌ అడ్మిషన్లపై అపోహలొద్దు - ఆర్‌ఐవో

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 30: ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు అపోహలు చెందవద్దని ఆర్‌ఐవో శ్రీనివాసులురెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన పట్టణ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమార్థం ప్రభుత్వం నిబంధనలను అనుసరించి ఈ విధానం ప్రారంభించామన్నారు. జీ ప్లస్‌ 3 భవనాలకు ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌ ఉండాలని, కమర్షియల్‌ కాంప్లెక్సుల్లో కళాశాలలు ఉండకూడదని, 8వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటేనే కళాశాల ఏర్పాటుకు, అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో అనుమతి వస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలన్నింటిలో తరగతికి(ఆర్ట్స్‌ లేదా సైన్సు గ్రూపు) 40 మంది చొప్పున అనుమతిస్తామన్నారు.


అన్ని ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నామన్నారు. కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు చిన్న, చిన్న సౌకర్యాల మెరుగు కోసం 60రోజులు గడువు అడుగుతూ అఫిడవిట్లు సమర్పి స్తున్నాయని, ఆ కళాశాలలకు అడ్మిషన్ల ఇచ్చే అవకాశం ఉందన్నారు. నవంబరు 6వరకు అడ్మిషన్ల గడువు ఉందని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, అతిక్రమించిన కళాశాల లపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐవో హెచ్చరించారు.

Read more