మాజీ మంత్రులకు భద్రత తొలగింపు

ABN , First Publish Date - 2020-02-12T10:43:56+05:30 IST

మాజీ మంత్రులకు ఉండిన వ్యక్తిగత భద్రతను ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

మాజీ మంత్రులకు భద్రత తొలగింపు

చిత్తూరు సిటీ, ఫిబ్రవరి 11: మాజీ మంత్రులకు ఉండిన వ్యక్తిగత భద్రతను ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలు పూర్తయ్యాక ఎస్‌ఆర్‌సీలో భాగంగా తొలుత మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత తొలగించారు. తాజాగా మాజీ మంత్రులకు ఉండిన వ ప్లస్‌ వన్‌ భద్రతను ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో మాజీ మంత్రులైన అమరనాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు సెక్యూరిటీ తొలగించనున్నారు. ఇదిలా ఉంటే.. చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత కుటుంబానికి కూడా వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ ఉంది. వీరికి ఉంచుతారా? తొలగిస్తారా? వేచి చూడాలి. భద్రత తొలగింపుపై పోలీసు ఉన్నతాధికారులను వివరణ కోరగా.. ఇంకా తమకెలాంటి అధికారిక ఉత్తర్వులు అందలేదని చెప్పారు. 

Updated Date - 2020-02-12T10:43:56+05:30 IST