పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-11-26T11:11:40+05:30 IST

పెండింగ్‌ డీఏల విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలని ఉపాఽధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలి
విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి


మదనపల్లె క్రైం, నవంబరు 25: పెండింగ్‌ డీఏల విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలని ఉపాఽధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.  బుధవా రం ఆయన మదనపల్లె ఎస్టీయూ భవన్‌లో జరిగిన డివిజన్‌ స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీని ప్రకటించాలని కోరారు. ఉద్యోగుల రెండు నెలల జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. కరోనాతో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయాలన్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో అన్ని ఖాళీలను చూపించాలన్నారు. అనంతరం డివిజన్‌ పరిధిలో ఇటీవల పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు రమణప్ప, ఉపాధ్యక్షుడు పోకల మధుసూదన్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీ, జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T11:11:40+05:30 IST