ఆర్‌జీయూకేటీ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-12-13T06:42:26+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ట్రిపుల్‌ ఐటీ) విద్యాసంస్థల్లో ప్రవేశాల పరీక్ష ఫలితాలు శనివారం విడుదల చేశారు.

ఆర్‌జీయూకేటీ ఫలితాలు విడుదల

మెరిట్‌ జాబితాలో 200 మంది జిల్లా విద్యార్థులు


తిరుపతి(విద్య), డిసెంబరు 12: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ - ట్రిపుల్‌ ఐటీ) విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈనెల ఐదో తేదీ నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల చేశారు. మెరిట్‌ జాబితాలో 200మంది మన జిల్లా విద్యార్థులు స్థానం సాధించినట్లు కన్వీనర్‌ ప్రకటించారు. 90 మార్కులకుపైగా ఆరుగురు, 81-90మార్కుల మధ్య 53మంది, 71-80మార్కుల మధ్య 141మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. మొత్తం 6,563 మంది దరఖాస్తు చేసుకోగా.. బాలురు 3,245 మంది, బాలికలు 3,068 మంది పరీక్షలు రాశారు. కేటగిరీ, కమ్యూనిటీ వైజ్డ్‌ టాపర్స్‌లో మన విద్యార్థులకు స్థానం లభించలేదు. ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌లో తమ హాల్‌ టికెట్ల సాయంతో ఫలితాలు తెలుసుకోవచ్చు.

Updated Date - 2020-12-13T06:42:26+05:30 IST