-
-
Home » Andhra Pradesh » Chittoor » regional drug store in ruya hospital
-
రుయాలో రూ.20 కోట్లతో రీజనల్ డ్రగ్ స్టోర్
ABN , First Publish Date - 2020-12-28T05:26:27+05:30 IST
రుయాస్పత్రిలో రూ.20 కోట్లతో సిటీ డయాగ్నస్టిక్ సెంటర్, రీజనల్ డ్రగ్ స్టోర్ భవన నిర్మాణం చేపడుతున్నట్టు ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

స్థల పరిశీలన చేసిన ఏపీఎంఎస్‌ఐడీసీ
చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి
తిరుపతి (వైద్యం), డిసెంబరు 27: రుయాస్పత్రిలో రూ.20 కోట్లతో సిటీ డయాగ్నస్టిక్ సెంటర్, రీజనల్ డ్రగ్ స్టోర్ భవన నిర్మాణం చేపడుతున్నట్టు ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థల పరిశీలన నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిల్లోనే సిటీ డయాగ్నస్టిక్ సెంటర్, రీజనల్ డ్రగ్ స్టోర్ కేంద్రాలను నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. రుయాలో ప్రస్తుతం ఉన్న పాత సదరం భవనం నిరుపయోగంగా ఉందని, దీన్ని తొలగించి ఆ స్థానంలో రీజనల్ డ్రగ్ స్టోర్ నిర్మించనున్నట్టు చెప్పారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకే వైద్య పరీక్షలు, నాణ్యమైన మందులు అందుబాటులో ఉంటాయన్నారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఈ కృష్ణారెడ్డి, ఈఈ ధనంజయరెడ్డి, డీఈలు రమేష్‌బాబు, హరిప్రసాద్ రెడ్డి, ఏఈ హేమంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.