-
-
Home » Andhra Pradesh » Chittoor » rectification of service matters aprroached by svv association leaders to minister suresh
-
స్పెషల్ విద్యా వలంటీర్లకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2020-12-15T06:35:52+05:30 IST
సర్వీసు వ్యత్యాసాలతో నష్టపోకుండా చూడాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌కు స్పెషల్ విద్యా వలంటీర్ల సంఘ నేతలు విన్నవించారు.

వెదురుకుప్పం, డిసెంబరు 14: స్పెషల్ విద్యా వలంటీర్ల సర్వీస్ 3.3.2003 నుంచి పరిగణిస్తూ వారికి రావలసిన అన్నిరకాల సర్వీసు సంబంధ వ్యత్యాసాలను సరిచేయాలని అమరావతిలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురే్‌షను కలసి వినతిపత్రం అందజేసినట్లు ఎస్వీవీ జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి మునెయ్య, మిరియాల సుబ్బరాజు, కె.పరదేశి, తులసీదాస్ చెప్పారు. డీఎస్సీ-2002 ద్వారా ఎంపికైన స్పెషల్ విద్యా వలంటీర్లకు ఒక్కో జిల్లాలో ఒక్కొక్క నెల ఇంక్రిమెంట్లు ఇవ్వడంతో చాలామందికి అన్యాయం జరుగుతోందన్నారు. పొలిపాక రమేష్, నూనె నాగయ్య, టి.బాలాజీ, రవి, దండు అమర్, చేవూరి రమేష్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.