50 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు

ABN , First Publish Date - 2020-08-11T11:17:22+05:30 IST

జిల్లాలోని కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లలో తాత్కాలిక పద్ధతిలో పనిచేయడానికి ఎంపికైన 50 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలను ..

50 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 10: జిల్లాలోని కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లలో తాత్కాలిక పద్ధతిలో పనిచేయడానికి ఎంపికైన 50 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలను సోమవారం డీఎంహెచ్‌వో పెంచలయ్య అందజేశారు. మొత్తం 209  పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. ఇప్పటివరకు 100 మందికి నియమకపత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. దశలవారీగా మిగిలినవారి ఎంపిక కూడా పూర్తిచేస్తామని పేర్కొన్నారు. 


710 కొత్త ట్యాబ్‌లొచ్చాయి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కొత్తగా 710 ట్యాబ్‌లు వచ్చాయి. ఏఎన్‌ఎంలకు వీటిని అందజేయనున్నారు. గతంలో వీరికి ఇచ్చినవి మరమ్మతులకు గురికావడంతో ప్రభుత్వం కొత్తవి పంపింది. వీటిని త్వరలో పీహెచ్‌సీల వారీగా ఏఎన్‌ఎంలకు అందజేయనున్నారు. 

Updated Date - 2020-08-11T11:17:22+05:30 IST