40శాతం మందితో నడుస్తున్న ‘రాయలసీమ’ ఎక్స్‌ప్రెస్
ABN , First Publish Date - 2020-07-10T10:44:40+05:30 IST
తిరుపతి- నిజామాబాద్ స్పెషల్ రైలు (రాయలసీమ ఎక్స్‌ప్రెస్) 40 శాతం మందితో నడుస్తోంది.

తిరుపతి (ఆటోనగర్), జూలై9: తిరుపతి- నిజామాబాద్ స్పెషల్ రైలు (రాయలసీమ ఎక్స్‌ప్రెస్) 40 శాతం మందితో నడుస్తోంది. కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఎక్స్‌ప్రెస్‌ల రాకపోకలు రద్దుచేసింది. నెల రోజులుగా 130 ప్రత్యేక రైళ్లను రాజధానుల మధ్య నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో తిరుపతి పుణ్యక్షేత్రం ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ మార్గంలో (02793) ప్రత్యేక రైలు నడుపుతోంది. ఈ రైలు సామర్థ్యం మేరకు గురువారం సెకండ్ ఏసీలో 104 బెర్త్‌లకు గాను 33 మంది, థర్డ్ ఏసీలో 432కు 70, సెకండ్ స్లీపర్‌లో 640కు 433, సెకండ్ సీటింగ్‌లో 400 సీట్లకు 105 మంది మాత్రమే ప్రయాణించారు. తొలి రెండు రోజుల్లో మినహా మిగిలిన రోజుల్లో 40-50 శాతం మందితో ప్రయాణిస్తోందని అధికారులు తెలిపారు.