నేటి నుంచి రేషన్ పంపిణీ
ABN , First Publish Date - 2020-12-05T06:13:58+05:30 IST
నేటి నుంచి కార్డుదారులకు నిత్యావసరాలు అందస్తామని డీఎస్వో చెప్పారు.
చిత్తూరు(సెంట్రల్), డిసెంబరు 4: జిల్లాలోని 11,88,779 మంది అంత్యోదయ అన్నయోజన, తెల్లరేషన్ కార్డుదారులకు శనివారం నుంచి డిసెంబరు నెల కోటా బియ్యం, కందిపప్పు, చక్కెర పంపిణీ చేయనున్నట్లు డీఎస్వో శివరామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్డుదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారానే రేషన్ తీసుకోవాలని సూచించారు. కిలో బియ్యం రూపాయికి, కందిపప్పు రూ.67కి, అరకిలో చక్కెర రూ.17కి, అంత్యోదయ కార్డుదారులకు కిలో చక్కెర రూ.13.50కి అందిస్తున్నట్లు చెప్పారు. నిత్యావసరాలను ఇప్పటికే చౌకదుకాణాలకు సరఫరా చేసినట్లు పౌరసరఫరాల సంస్థ డీఎం సోమయాజులు తెలిపారు.