రేషన్ పంపిణీ రేపటివరకు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-01T06:54:59+05:30 IST
ఉచిత రేషన్ పొందలేకపోయిన కార్డుదారులకు ప్రభుత్వం బుధవారం వరకు గడువు పొడిగించింది.

ఒక్క వేలిముద్ర వేస్తే చాలు: డీఎస్వో
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 30: నివర్ తుఫాన్‌తో ఇబ్బందుల పాలై ఉచిత రేషన్ పొందలేకపోయిన కార్డుదారులకు ప్రభుత్వం బుధవారం వరకు గడువు పొడిగించింది. ఈ మేరకు సోమవారం డీఎస్వో టి.శివరామప్రసాద్ మీడియాకు తెలిపారు. అలాగే సర్వర్ సమస్య కారణంగా కార్డుదారులు రెండుసార్లకు బదులు మంగళ, బుధవారాల్లో ఒక్క వేలిముద్ర వేస్తే సరిపోతుందని.. ఆ విధంగా డీలర్లను ఆదేశాలిచ్చామని చెప్పారు.