రేషన్‌ కోసం అర్ధరాత్రి పాట్లు

ABN , First Publish Date - 2020-11-26T04:54:15+05:30 IST

రేషన్‌ బియ్యం కోసం కార్డుదారులకు తిప్పలు తప్ప డం లేదు. సర్వర్‌ సమస్యతో డీలర్లు సైతం బియ్యం పంపిణీ చేయడానికి ఇబ్బం దులు పడుతున్నారు.

రేషన్‌ కోసం అర్ధరాత్రి పాట్లు
బియ్యం కోసం అర్ధరాత్రి వేచి ఉన్న కార్డుదారులు

యాదమరి, నవంబరు 25: రేషన్‌ బియ్యం కోసం కార్డుదారులకు తిప్పలు తప్ప డం లేదు. సర్వర్‌ సమస్యతో డీలర్లు సైతం బియ్యం పంపిణీ చేయడానికి ఇబ్బం దులు పడుతున్నారు. ఉదయం పూట సర్వర్‌ పనిచేయకపోవడతో అర్ధరాత్రి నుంచి బియ్యం కోసం కార్డుదారులు క్యూలో ఉంటున్నారు. కీనాటంపల్లెలో గత మూడు రోజులుగా చలిని సైతం లెక్కచేయక కార్డుదారులు రాత్రి 2 గంటలకు లైన్లో నిల్చుని సరుకులు తీసుకుంటున్నారు. 

Read more