మతిస్థిమితంలేని బాలికపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2020-05-18T11:20:56+05:30 IST

చంద్రగిరి మండలంలో ఓ మతిస్థిమితంలేని బాలిక (14)పై అత్యాచారయత్నం జరిగినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది

మతిస్థిమితంలేని బాలికపై అత్యాచారయత్నం

హైడ్రామా నడుమ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


చంద్రగిరి, మే 17: చంద్రగిరి మండలంలో ఓ మతిస్థిమితంలేని బాలిక (14)పై అత్యాచారయత్నం జరిగినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కూడా హైడ్రామా నడుమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం బాలిక ఆడుకుంటుండగా.. అదే గ్రామానికి చెందిన నాదముని (35) మామిడి కాయలు కోసిస్తానని తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఆ బాలిక కేకలు వేయడంతో అటుగా వెళుతున్న గ్రామస్తులు గమనించి.. ఆ యువకుడిపై రాళ్లు విసురుతూ పట్టుకోవడానికి ప్రయత్నించారు. నిందితుడు వారినుంచి తప్పించుకుని, పరారయ్యాడు.


ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత పోలీసులు పట్టించుకోలేదు. చివరకు సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవడంతో సాయంత్రం పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. ఆ తర్వాత కూడా గ్రామానికి చెందిన కొందరు నేతలు రాజీ చేయడానికి విఫలయత్నం చేశారు. ఆ తర్వాతే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామచంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-05-18T11:20:56+05:30 IST