పొంగిపొర్లుతున్న వాగులు

ABN , First Publish Date - 2020-10-24T11:53:41+05:30 IST

జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి.చాలా ప్రాంతాల్లో వంకలు, వాగులు వుధ్రుతంగా ప్రవహిస్తున్నాయి.పలు చెరువులు నిండి మొరవ పోతున్నాయి.

పొంగిపొర్లుతున్న వాగులు

ప్రమాదకరంగా జలప్రవాహాలు

పలు గ్రామాలకు ఆగిన రాకపోకలు


చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 23 : జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి.చాలా ప్రాంతాల్లో వంకలు, వాగులు  వుధ్రుతంగా ప్రవహిస్తున్నాయి.పలు చెరువులు నిండి మొరవ పోతున్నాయి.సోమల మండలంలో గురువారం  ప్రారంభమైన వర్షం ఏకదాటిగా రాత్రి 10గంటల వరకు కురిసింది. 94.6మి.మీ వర్షపాతం నమోదైంది. సోమల, కందూరు, నంజంపేట,పెద్దఉప్పరపల్లి, ఆవులపల్లి, ఇరికిపెంటల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు హోరెత్తాయి. పంట పొలాలను ముంచెత్తాయి. వరి పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. కొన్ని చెరువులు ప్రమాదస్ధితికి చేరుకున్నాయి. వరి, టమోటా పంటలు  దెబ్బతిన్నాయి. గార్గేయనది ఉఽధ్రుతికి కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సోమల-నంజంపేట ప్రధాన మార్గంలోని జీడిరేవుల వంక పొంగి ప్రవహించడంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించి పోయాయి. పెద్దమండ్యం సమీపంలోని కుషావతి,పలమనేరు సమీపంలోని కౌండిన్య నదుల ప్రవాహం ఉధృతంగా సాగుతోంది.అరుణానదిలో పెరిగిన వరద ఉధ్రుతితో అరణియార్‌ రిజర్వాయరులో శుక్రవారం సాయంత్రానికి 26 అడుగుల మేర నీటిమట్టం చేరింది.


నగరి మండలంలోని టీఆర్‌ కండ్రిగ ఇందిరమ్మ కాలనీలోకి కుశస్థలి నది నుంచి మూడు చెరువులకు వెళ్లే కాలువ పొంగి నీళ్లు వచ్చాయి.చాలాచోట్ల జలప్రవాహాలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సదుం-పీలేరు మార్గంలోని గార్గేయనది నుండి పింఛా ఏరు శుక్రవారం రాత్రినుంచి పరవళ్లు తొక్కింది. దీంతో ఈమార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నివారించారు.  అలాగే మదనపల్లె మారంగలోని బడబళ్లవంకలో నీటి వుధ్రుతి అధిక మై రోడ్డు జలమయంగా మారింది. పెనుమూరు మండలం కలవకుంటలోని ఎన్టీఆర్‌ జలాశయం గేట్లుఎత్తి దిగువ ప్రాంతాలకు నీళ్ళు వదిలిన విషయం తెలిసిందే.దీంతో  గంగాధరనెల్లూరు మండలంలోని కలిజవేడు- ముకుందరాయనిపేటకు మధ్యలో గల మట్టిరోడ్డుపై వాహన రాకపోకలు సాగిస్తుండగా, నీవానది వుధ్రుతికి రోడ్డు కొట్టుకుపోయింది.దీంతో ఈ ప్రాంతప్రజలకు రాకపోకలు ఇబ్బందిగా మారాయి.వర్షాల కారణంగా గంగాధరనెల్లూరు వద్ద పాతతారు రోడ్డుపై నీవానది ప్రవహిస్తోంది.  గడిచిన 24 గంటల్లో బి.కొత్తకోట, బీఎన్‌ కండ్రిగ మినహా  64 మండలాల్లో బలమైన వర్షం కురిసింది. 


పాలసముద్రంలో 97.2మిమీ, కార్వేటినగరంలో 95, సోమలలో 94.6, నగరిలో 90.2, పుత్తూరులో 79.2, పూతలపట్టులో 78.4, చౌడేపల్లెలో 78.2, ఎస్‌ఆర్‌పురంలో 71.6, విజయపురంలో 70.8, పెనుమూరులో 68.2, కేవీబీపురంలో 60.4, తంబళ్లపల్లెలో 60, శాంతిపురంలో 57.2, సదుంలో 56.2, గుర్రంకొండలో 53, నాగలాపురంలో 52.2, నారాయణవనంలో 51.2, వెదురుకుప్పంలో 48.2, జీడీనెల్లూరు, పిచ్చాటూరులో 42.2, పుంగనూరులో 42, సత్యవేడులో 39.2, వి.కోటలో 39, చంద్రగిరిలో 38.4, పెద్దపంజాణిలో 38, నిండ్రలో 37.4, తిరుపతి రూరల్‌లో 36.2, ఆర్‌సీపురంలో 35.2, ఐరాలలో 34.6, బంగారుపాళ్యంలో 33.2, గుడిపాలలో 30.2, పీలేరులో 27.2, చిత్తూరులో 27, కలికిరిలో 26.6, వాయల్పాడులో 25.6, పులిచెర్లలో 24.8, రొంపిచెర్లలో 24.8, తొట్టంబేడులో 24.2, గంగవరంలో 23.2, బైరెడ్డిపల్లెలో 22.8, కలకడలో 22.6, యాదమరిలో 22, పాకాలలో 21.4, తవణంపల్లెలో 20.4, రామకుప్పంలో 20.2, చిన్నగొట్టిగల్లులో 18.4, పెద్దమండ్యంలో 17.4, వడమాలపేటలో 16.2, ఎర్రావారిపాళ్యంలో 15,6, పలమనేరులో 15.4, రామసముద్రంలో 14, వరదయ్యపాళ్యంలో 13.4, శ్రీకాళహస్తిలో 13.2, కురబలకోటలో 12.8, తిరుపతి అర్బన్‌లో 11.8, మదనపల్లెలో 10.8మిమీ వర్షపాతం నమోదవగా.. మిగిలిన మండలాల్లో 10.8 మి.మీ కంటే తక్కువ వర్షం కురిసింది. 

Updated Date - 2020-10-24T11:53:41+05:30 IST