రైల్వే రిజర్వేషన్‌ కార్యాలయం మూత

ABN , First Publish Date - 2020-03-24T10:50:39+05:30 IST

దేశవ్యాప్తంగా ఈనెల 31వ తేదీవరకు రైళ్ల రాకపోకలు రద్దు చేసిన విషయం తెలిసిందే.

రైల్వే రిజర్వేషన్‌ కార్యాలయం మూత

 వచ్చేనెల 1 నుంచి టికెట్ల రద్దుకు అవకాశం


తిరుపతి (ఆటోనగర్‌), మార్చి 23: దేశవ్యాప్తంగా ఈనెల 31వ తేదీవరకు రైళ్ల రాకపోకలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలో రైల్వే టికెట్ల రిజర్వేషన్‌ కార్యాలయం సోమవారం మూతపడింది. మరోవైపు ఈనెల 22 నుంచి 31వ తేదీవరకు టికెట్లను రిజర్వేషన్లు చేసుకున్నవారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే అధికారులను వివరణ కోరగా.. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టికెట్లను రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు 90 రోజుల్లోపు రద్దు చేసుకుంటే మొత్తం డబ్బు రీఫండ్‌ చేస్తామని చెప్పారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రద్దుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. 

Read more