-
-
Home » Andhra Pradesh » Chittoor » protest for public anty decissions
-
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడండి
ABN , First Publish Date - 2020-12-16T05:00:04+05:30 IST
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ, బీజేపీ, టీడీపీలకు బుద్ధి వచ్చేలా పోరాడాలని యువజన కాంగ్రెస్ నాయకులకు పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు.

యువజన కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో నేతలకు తులసిరెడ్డి పిలుపు
తిరుపతి (వైద్యం), డిసెంబరు 15: రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ, బీజేపీ, టీడీపీలకు బుద్ధి వచ్చేలా పోరాడాలని యువజన కాంగ్రెస్ నాయకులకు పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలో మంగళవారం యువజన కాంగ్రెస్ నేతలకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న యువజనులు అనుకుంటే ఏమైనా సాధించగలరన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. అంతకు ముందు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి తులసిరెడ్డితో పాటు నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్, క్రిష్టోఫర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, ప్రమీలమ్మ, యువజన కాంగ్రెస్ శిక్షణ తరగతుల ఇంచార్జ్ సీతారాం లంబా, మొయిద్దీన్, నైషద్, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి శ్వేతా, లక్ష్మీకాంత్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.