జయలలిత రాజకీయ జీవితంపై త్వరలో సినిమా

ABN , First Publish Date - 2020-07-18T11:01:44+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితంపై త్వరలోనే సినిమా తీయనున్నట్లు నిర్మాత రాకేష్‌రెడ్డి తెలిపారు.

జయలలిత రాజకీయ జీవితంపై త్వరలో సినిమా

తిరుమల, జూలై17 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితంపై త్వరలోనే సినిమా తీయనున్నట్లు నిర్మాత రాకేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన కొన్ని ఘటనలతో చిత్రం ఉంటుందన్నారు. శశికళ విలిన్‌గా ఉండబోతుందా అనే ప్రశ్నకు బదులిస్తూ వాస్తవాలే ఉంటాయన్నారు. కరోనా ప్రభావం తగ్గాక షూటింగ్‌ మొదలవుతుందన్నారు. 

Updated Date - 2020-07-18T11:01:44+05:30 IST