ఇళ్లలోనే ‘రోజా’ దీక్షలు

ABN , First Publish Date - 2020-04-26T10:55:19+05:30 IST

ముస్లింలు ఈ ఏడాది తొలిసారిగా మసీదులకు దూరంగా రమజాన్‌ ప్రార్థనలు ఆచరిస్తున్నారు.

ఇళ్లలోనే ‘రోజా’ దీక్షలు

తొలిసారి మసీదులకు దూరంగా రమజాన్‌ ప్రార్థనలు 


పీలేరు, ఏప్రిల్‌ 25: ముస్లింలు ఈ ఏడాది తొలిసారిగా మసీదులకు దూరంగా రమజాన్‌ ప్రార్థనలు ఆచరిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మసీదుల్లో సామూహిక ప్రార్థనలపై ఆంక్షలు విధించడంతో జిల్లాలోని ముస్లింలు ఇళ్లలోనే ఉపవాస దీక్షలు(రోజా) చేపడుతున్నారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, పీలేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, కుప్పం, ములకలచెరువు, బి.కొత్తకోట తదితర ప్రాంతాల్లోని ముస్లింలు శనివారం తొలి ఉపవాసం ఆచరించారు.


పురుషులు, పిల్లలు సైతం ఇళ్లల్లోనే సహరీ, ఇఫ్తారీలను ఆచరించారు.  రమజాన్‌ మాసం ప్రత్యేక తరావీహ్‌ నమాజుతోపాటు ఇతర ప్రార్థనలు కూడా ఇళ్లలోనే ఇంటిల్లీపాదీ ఆచరిస్తున్నారు. మసీదుల్లో ప్రభుత్వం అనుమతించిన మేరకు కేవలం ఐదుగురితో నమాజులు నిర్వహించారు. జిల్లా అంతటా మసీదులు  ప్రత్యేక అలంకరణలకు నోచుకోకపోవడంతో ధార్మిక కళను తప్పినట్లు కనిపిస్తున్నాయి. ముస్లింల ఇళ్లు రమజాన్‌ శోభను సంతరించుకున్నాయి.

Updated Date - 2020-04-26T10:55:19+05:30 IST