పద్మావతి వర్సిటీలో పీజీసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

ABN , First Publish Date - 2020-12-08T05:23:23+05:30 IST

బంద్‌ కారణంగా పద్మావతి వర్సిటీలో మంగళవారం నిర్వహించాల్సిన పీజీసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది

పద్మావతి వర్సిటీలో పీజీసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 7: బంద్‌ కారణంగా పద్మావతి వర్సిటీలో మంగళవారం నిర్వహించాల్సిన పీజీసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. వాయిదా పడిన ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్‌, ఎంఏ మ్యూజిక్‌, ఎంఏ భరతనాట్యం కోర్సుల కౌన్సెలింగ్‌ను 18వ తేదీ నిర్వహిస్తామని అడ్మిషన్స్‌ విభాగ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సువర్ణలతాదేవి తెలిపారు. ఎస్వీయూలో పరీక్షల వాయిదాఎస్వీయూ పరిధిలో మంగళవారం నిర్వహించాల్సిన పీజీ రెండో సెమిస్టర్‌, డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ పరీక్షలు కూడా బంద్‌తో వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను 11వ తేది నిర్వహిస్తామని సీఈ దామ్లా నాయక్‌ తెలిపారు.

Updated Date - 2020-12-08T05:23:23+05:30 IST