చాలా రోజుల తరువాత.. కాణిపాకం కిటకిట

ABN , First Publish Date - 2020-12-11T06:01:57+05:30 IST

చాలా రోజుల తరువాత కాణిపాక క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది

చాలా రోజుల తరువాత.. కాణిపాకం కిటకిట
కాణిపాక ఆలయ క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 10 : చాలా రోజుల తరువాత కాణిపాక క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దాదాపు 8వేలమందికి పైగా గురువారం వినాయకస్వామిని దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.మంచి ముహూర్తాలుండడంతో  కాణిపాకంలో వందకు పైగా పెళ్లిళ్లు జరగడంతో వధూవరులు,వారి బంధువులతో కాణిపాకం రద్దీగా కన్పించింది.కాగా గత 31రోజుల వరసిద్ధుడి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించగా రూ. 83.39 లక్షలు లభించినట్లు ఈవో వెంకటేశు తెలిపారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి,ఏఈవోలు చిట్టెమ్మ, రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, హరిమాధవరెడ్డి, సీఎఫ్‌వో నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు ప్రసాద్‌, కోదండపాణి, కాణిపాకం ఆంధ్రాబ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T06:01:57+05:30 IST