దశలవారీగా భూగర్భ విద్యుత్‌ పనులు : సీఎండీ

ABN , First Publish Date - 2020-04-26T10:56:20+05:30 IST

తిరుపతిలో ఆగిపోయిన భూగర్భ విద్యుత్‌ పనులను దశలవారీగా ప్రారంభిస్తామని సదరన్‌ డిస్కం సీఎండీ హరనాథరావు ..

దశలవారీగా భూగర్భ విద్యుత్‌ పనులు : సీఎండీ

తిరుపతి (ఆటోనగర్‌), ఏప్రిల్‌ 25: తిరుపతిలో ఆగిపోయిన భూగర్భ విద్యుత్‌ పనులను దశలవారీగా ప్రారంభిస్తామని సదరన్‌ డిస్కం సీఎండీ హరనాథరావు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులకు అనుగుణంగానే పనులు చేపడతామన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదివరకు జరిగిన పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ఆయనవెంట తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ ఇంజనీరు డీవీ చలపతి, నిర్మాణాల విభాగం ఈఈ రమణ, తిరుపతి టౌన్‌ డివిజన్‌ ఈఈ ఎం.కృష్ణారెడ్డి తదితరులున్నారు. కాగా.. గాలివానకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తలెత్తిందన్నారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని డిస్కం పరిధిలోని జిల్లాల సీఈలు, ఎస్‌ఈలను సీఎండీ ఆదేశించారు. 

Updated Date - 2020-04-26T10:56:20+05:30 IST