ఆలయ ఈవోకు వైసీపీ నేత బెదిరింపులు!
ABN , First Publish Date - 2020-10-20T02:36:55+05:30 IST
తిరుపతి : నగరంలోని సురుటుపల్లి పల్లి కొండేశ్వర ఆలయ ఈవో మురళి కృష్ణపై వైసీపీ నేత బెదిరింపులు పాల్పడ్డారు.
తిరుపతి : నగరంలోని సురుటుపల్లి పల్లి కొండేశ్వర ఆలయ ఈవో మురళి కృష్ణపై వైసీపీ నేత బెదిరింపులు పాల్పడ్డారు. వైసీపీ నేత, ఆలయ మాజీ చైర్మన్ మునిశేఖర్ రెడ్డి తనను బెదిరిస్తున్నాడని ఆలయ ఈవో వెల్లడించారు. పూర్తి వివరాల్లోకెళితే.. గత పది రోజులుగా తనను బెదిరిస్తున్నాడని ఈవో తెలిపారు. గత సంవత్సరం శారద నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఉబయదారుడు మధురెడ్డిని తొలగించి తన బావని ఉబయదారుడుగా నియమించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన మీడియా ముఖంగా తెలిపారు.
దీనిపై దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఆలయానికి వచ్చి విచారణ చేపట్టారన్న విషయం కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ విచారణలో ఉబయదారుడిని మార్చే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారన్నారు. అయినా సరే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉబయదారుడిని మార్చాలని మళ్లీ మునిశేకర్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నారని ఈవో ఆరోపించారు. ఇందుకు ఒప్పుకోక పోవడంతో గత 10 రోజులుగా అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈవో మురళి తెలిపారు. దేవదాయశాఖ మంత్రి, కమిషనర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఈవో మీడియా ముఖంగా తెలిపారు. కాగా.. గతంలో ఆలయ ఈవో మురళీ నెలకి రెండు లేదా మూడు సార్లు మాత్రమే ఆలయానికి వస్తారని.. ఇలా ఈవో జాడ కనిపించట్లేదని అప్పట్లో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైన విషయం విదితమే.