తిరుపతి స్విమ్స్‌‌లో ఓపీలు రద్దు.. రోగులు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-07-14T14:49:00+05:30 IST

తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

తిరుపతి స్విమ్స్‌‌లో ఓపీలు రద్దు.. రోగులు ఆగ్రహం

తిరుపతి : తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆస్పత్రిలోని 40 మంది వైద్య సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ రావటంతో రద్దు చేస్తున్నట్టు సోమవారం రాత్రి ప్రకటించారు. తదుపరి ఆదేశాల వరకు ఓపీలు ఉండవని ఓపీ హాల్ ముందు బోర్డు పెట్టారు. అయితే ఈ విషయం తెలియక తెలియక ఓపీ సేవలకు రాయలసీమ జిల్లాల నుంచి వందలాదిగా రోగులు వచ్చారు. కనీసం రెండు రోజుల ముందైనా చెప్పి ఉండాల్సిందని రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. తిరుపతి నగరంలో ఇప్పటి వరకూ 1092 కేసులు నమోదయ్యాయి. 20 కేసులున్న 18 డివిజన్లలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-07-14T14:49:00+05:30 IST