ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-11-26T04:44:32+05:30 IST

శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి హంద్రీ -నీవా కాలువ సమీపంలో మంగళవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు..

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి
దేవరాజ్‌ (ఫైల్‌ఫొటో)

శాంతిపురం, నవంబరు 25: శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి హంద్రీ -నీవా కాలువ సమీపంలో మంగళవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని కొత్తపేటకు చెందిన దేవరాజ్‌, లోకేష్‌, మురుగేష్‌ మంగళవారం రాత్రి శాంతిపురంలో పనిముగించుకుని ద్విచక్రవాహనంలో గ్రామానికి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో చిన్నారిదొడ్డి హంద్రీ -నీవా కాలువ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం వారి వాహనాన్ని ఢీకొంది.. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాల్లోని దేవరాజు, మురుగేష్‌, లోకేష్‌, రాళ్లబూదుగూరుకు చెందిన మునిరాజ్‌, సతీష్‌కుమార్‌లకు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన దేవరాజ్‌ను బెంగళూరు ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. రాళ్లబూదగూరు ఎస్‌ఐ మురళిమోహన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more