-
-
Home » Andhra Pradesh » Chittoor » one old man died with corona
-
స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి మృతి.. ఆరుకు చేరిన కరోనా మరణాలు
ABN , First Publish Date - 2020-06-22T17:49:53+05:30 IST
స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందారు. పళ్లిపట్టులోని శక్తిఅమ్మన్

తిరుపతి (వైద్యం): స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందారు. పళ్లిపట్టులోని శక్తిఅమ్మన్ కోయిల్స్ ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల వ్యక్తి.. న్యూరాలజీ సమస్యతో పదేళ్లుగా స్విమ్స్‌లో ఓపీ ద్వారా వైద్య సేవల కోసం వచ్చిపోతుండేవారు. ఈ క్రమంలో ఈనెల 15వ తేదీన తిరుచానూరు యోగిమల్లవరంలోని కుమారుడి ఇంటికి వచ్చారు.
ఆ సమయంలో కాస్త శ్వాస సంబంధ సమస్య ఉండటంతో అనుమానంతో వైద్యుల సూచన మేరకు ల్యాబ్‌కు వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఈనెల 17 నుంచి స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈయన.. వ్యాధి తీవ్రం కావడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. గోవిందధామం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో జిల్లాలో కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది.