రోడ్డు ప్రమాదంలో వ్యక్తిమృతి
ABN , First Publish Date - 2020-12-02T05:21:08+05:30 IST
బంగారుపాళ్యం మండలంలోని రంగంపేట క్రాస్‌రోడ్డు సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

పూతలపట్టు, డిసెంబర్ 1: మండలంలోని రంగంపేట క్రాస్‌రోడ్డు సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. బంగారుపాళ్యం మండలం బలిజపల్లె గ్రామానికి చెందిన సురేష్(37) బంగారుపాళ్యంలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్ సోమవారం పనినిమిత్తం ద్విచక్రవాహనంపై తిరుపతికి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి బయలుదేరాడు. రంగంపేట క్రాస్ రోడ్డు సమీపాన వాహనం అదుపు తప్పడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మంగళవారం ఉదయం ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఎస్‌ఐ రాజ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.