కారు, సిమెంటు లారీ ఢీ: కారు డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2020-12-01T05:34:37+05:30 IST
పలమనేరు - వి.కోట ప్రధాన రహదారిలో మద్దిరాళ్ల క్రాస్ వద్ద కారు, సిమెంటు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన కారు డ్రైవర్ మణివన్ణన్ (28) మృతిచెందగా బరుగూరుకు చెందిన తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు.

వి.కోట, నవంబరు 30: పలమనేరు - వి.కోట ప్రధాన రహదారిలో మద్దిరాళ్ల క్రాస్ వద్ద కారు, సిమెంటు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన కారు డ్రైవర్ మణివన్ణన్ (28) మృతిచెందగా బరుగూరుకు చెందిన తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రం బరుగూరుకు చెందిన భాగ్యమ్మకు పక్షవాతం రావడంతో ఆమె కుమార్తె విజయతో కలసి కారులో విరూపాక్షపురం వచ్చారు. అక్కడ వైద్యం చేయించుకుని తిరుగుప్రయాణమయ్యారు. సోమవారం ఉదయం మద్దిరాళ్ల క్రాస్ వద్ద కారు డ్రైవర్ నిద్రమత్తులో ధర్మపురి నుంచి ఎర్రగుండ్లకు సిమెంటు కోసం వెళుతున్న లారీని ఎదురుగా ఢీకొన్నాడు. కారు డ్రైవర్‌తో పాటు, అందులో ప్రయాణిస్తున్న భాగ్యమ్మ, విజయ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని వి.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మైరుగైన వైద్యం కోసం కుప్పం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో డ్రైవర్ మణివణ్ణన్ మృతిచెందాడు. మహిళలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వి.కోట సీఐ ఎల్లమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రధాన రహదారిపై ఈ ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.