ఆప్కోలో ఆఫర్లు
ABN , First Publish Date - 2020-09-12T05:33:15+05:30 IST
దసరా సందర్భంగా ఆప్కోలో పలు ఆఫర్లు ప్రవేశ పెట్టినట్లు తిరుపతి ఆప్కో మండల వాణిజ్యాధికారి బీవీ

తిరుపతి (యశోదనగర్), సెప్టెంబరు 11: దసరా సందర్భంగా ఆప్కోలో పలు ఆఫర్లు ప్రవేశ పెట్టినట్లు తిరుపతి ఆప్కో మండల వాణిజ్యాధికారి బీవీ రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి గాంధీ రోడ్డులోని ఆప్కో-1, 2, వకుళాభవన్ ఆప్కో, చిత్తూరులోని ఆప్కో విక్రయశాలల్లోని వస్త్రాలపై వన్ ప్లస్ టు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రముఖ చేనేత సహకార సంఘాల నుంచి కొన్న అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు. వచ్చే నెల రెండో తేదీన చేనేత వస్త్రాలు, హ్యాండీ క్రాఫ్ట్‌లకు మార్కెటింగ్ కల్పించేందుకు ఆన్‌లైన్‌లో ఉంచాలని సీఎం జగన్ సంకల్పించారని తెలిపారు. అమెజాన్ లాంటి ఆన్‌లైన్ వ్యవస్థల ద్వారా చేనేత వస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో అన్ని ఈ-కామర్స్ వేదికల్లోను ఆప్కో వస్త్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు.