మేనేజ్‌మెంట్‌ కళాశాలల నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2020-12-07T07:11:08+05:30 IST

జిల్లాలోని ఎంబీఏ, ఎంసీఏ (మేనేజ్‌మెంట్‌) కళాశాలల నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక భవానీనగర్‌లోని గీతం స్కూలులో ఎన్నుకున్నారు.

మేనేజ్‌మెంట్‌ కళాశాలల నూతన కార్యవర్గం ఎన్నిక

తిరుపతి (విద్య), డిసెంబరు 6: జిల్లాలోని ఎంబీఏ, ఎంసీఏ (మేనేజ్‌మెంట్‌) కళాశాలల నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక భవానీనగర్‌లోని గీతం స్కూలులో ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడిగా వై.ఆనందరెడ్డి (రిమ్స్‌), అధ్యక్షుడిగా మిద్దెల హరి (స్కిమ్స్‌), కార్యదర్శిగా జి.రాజారెడ్డి (అక్షర), కోశాధికారిగా డాక్టర్‌ తమ్మినేని వెంకటేశ్వర్లు (గేట్‌), జిల్లా కో-ఆర్డినేటర్‌గా వి.రవికుమార్‌చౌదరి (ఆర్‌సీఆర్‌), ఉపాధ్యక్షురాలిగా టి.భారతి (రాయల్‌), ఉపకార్యదర్శిగా ఆర్‌.శివప్రసాద్‌వర్మ (ఆర్‌సీఆర్‌)లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్లుగా మేనేజ్‌మెంట్‌ కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డాక్టర్‌ జె.ప్రకాష్‌రెడ్డి, బి.దినకర్‌బాబు, ఎం.యువరాజ్‌, డాక్టర్‌ త్రివేది, డాక్టర్‌ రమణ, డాక్టర్‌ వెంకట్రావు, అమరేంద్రనాయుడు, డాక్టర్‌ రవి, ఉమాశంకర్‌, హితేష్‌, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T07:11:08+05:30 IST