ఎన్‌డీబీ రోడ్ల వివరాలు ఇవ్వండి

ABN , First Publish Date - 2020-11-13T06:00:22+05:30 IST

నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు కింద జిల్లాలో చేపట్టే రోడ్లకు సంబంధించి వివరాలు ఇవ్వాలి

ఎన్‌డీబీ రోడ్ల వివరాలు ఇవ్వండి

ఇంజనీరింగ్‌ చీఫ్‌ వేణుగోపాల్‌రెడ్డి


చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 12: నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు కింద జిల్లాలో చేపట్టే రోడ్లకు సంబంధించి వివరాలు ఇవ్వాలని రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్‌ చీఫ్‌ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్‌ఈ దేవానంద్‌ మాట్లాడుతూ ఎన్‌డీబీ కింద సెకండ్‌ ఫేస్‌లో జిల్లాలో 14 రోడ్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ రోడ్ల పొడువు, వెడల్పు సర్వేలు కొనసాగుతున్నాయని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఈ చంద్రశేఖర్‌. డీఈఈ పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T06:00:22+05:30 IST