ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు
ABN , First Publish Date - 2020-03-02T10:43:30+05:30 IST
సృజనాత్మకంగా బోధించిన ఇద్దరు ఉపాధ్యాయులు అరబిందో సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు.

పుత్తూరు, మార్చి 1: సృజనాత్మకంగా బోధించిన ఇద్దరు ఉపాధ్యాయులు అరబిందో సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలో ఈనెల 1న కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో వెయ్యిమంది ఉపాధ్యాయులు జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. వారిలో రాష్ట్రం తరఫున 52 మంది, జిల్లాలో పుత్తూరుకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పరమేశ్వర మంగళం ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు గజరాజన్‌తోపాటూ గుడుపల్లె ఉన్నత పాఠశాల గణితశాస్త్ర ఉపాధ్యాయుడు జయరాజు ఉన్నారు. మారిన కాలంలో విద్యార్థులకు సులభతర పద్ధతులతో బోధించినందుకు పురస్కారానికి ఎంపికయ్యారని ఎంఈవో తిరుమల రాజు తెలిపారు.