అవినీతిపై వార్తలు రాసిన జర్నలిస్టుపై దాడి దారుణం: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-09-01T16:55:28+05:30 IST

‘చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్‌ వెంకటనారాయణ ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి..

అవినీతిపై వార్తలు రాసిన జర్నలిస్టుపై దాడి దారుణం: లోకేశ్‌

అమరావతి(ఆంధ్రజ్యోతి): ‘చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్‌ వెంకటనారాయణ ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ కుటుంబాన్ని పెట్రోల్‌ పోసి తగలబెడతామని గూండాలు బెదిరించారు. ఓం ప్రతాప్‌ మరణం, ఇసుక మాఫియాను బహిర్గతం చేసినందుకు ఇలా చేశారు’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తమను తాము కాపాడుకునేందుకు ఆ కుటుంబం భయంతో ఇంట్లోకివెళ్లి తాళం వేసుకుందన్నారు. జర్నలిస్టులపై ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయ జోక్యం లేకుండా నేరస్తుల్ని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 



Updated Date - 2020-09-01T16:55:28+05:30 IST