భక్తి శ్రద్ధలతో నాగులచవితి పూజలు

ABN , First Publish Date - 2020-11-19T07:12:01+05:30 IST

తిరుపతి నగరంలో బుధవారం భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పూజలు

భక్తి శ్రద్ధలతో నాగులచవితి పూజలు
దేవేంద్ర థియేటర్‌ రోడ్డులోని శివాలయం వద్ద పూజలు

తిరుపతి(కల్చరల్‌), నవంబరు 18: తిరుపతి నగరంలో బుధవారం భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పూజలు జరిపారు. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లోని పుట్టల వద్దకు చేరి పసుపు,కుంకుమలతోను, పుష్పాలతోను, నూలు దారాలతోను పూజించారు. పుట్టలో పాలు పోసి, కోడిగుడ్లు వేశారు. నానబెట్టిన బియ్యం, నువ్వుల ప్రసాదం, చలిమిడిని నాగేంద్రుడికి నైవేద్యంగా సమర్పించారు. పుట్టచుట్టు ప్రదక్షిణలు చేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం వద్ద, ఇస్కాన్‌ టెంపుల్‌ సమీపం, దేవేంద్ర థియేటర్‌ వద్ద శివాలయంలోను, మంచినీళ్లగుంట పుట్టల వద్ద పూజలు చేశారు. 

Updated Date - 2020-11-19T07:12:01+05:30 IST