ఎంపీ దుర్గాప్రసాద్ మృతి పట్ల శ్రీసిటీ ఎండీ సంతాపం

ABN , First Publish Date - 2020-09-17T15:08:05+05:30 IST

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి తీవ్ర సంతాపం..

ఎంపీ దుర్గాప్రసాద్ మృతి పట్ల శ్రీసిటీ ఎండీ సంతాపం

సత్యవేడు/వరదయ్యపాళెం(చిత్తూరు): తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. దుర్గాప్రసాద్‌ మరణం తనను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందన్నారు. శ్రీసిటీ అభివృద్ధికి సూచనలు, సలహాలతో పాటు సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎంపీ దుర్గాప్రసాద్‌ మృతి పట్ల సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందన్నారు. 


Updated Date - 2020-09-17T15:08:05+05:30 IST