పుంగనూరుకు ప్రభుత్వ ఖాజీ నియామకం

ABN , First Publish Date - 2020-03-13T11:25:14+05:30 IST

పుంగనూరు ప్రభుత్వ ఖాజీగా మహమ్మద్‌ షేక్‌సాద్‌ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

పుంగనూరుకు ప్రభుత్వ ఖాజీ నియామకం

 కోడ్‌ను ధిక్కరించి ప్రభుత్వ ఉత్తర్వులు


 చిత్తూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):పుంగనూరు ప్రభుత్వ ఖాజీగా మహమ్మద్‌ షేక్‌సాద్‌ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ పుంగనూరు మండలానికి ప్రభుత్వ ఖాజీను నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈనెల 7వ తేదీ నుంచి ఎన్నికల కోడ్‌ రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి నియామకాలు, బదిలీలు చేయకూడదు. అయినప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం పుంగనూరులో ప్రభుత్వం ఖాజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పుంగనూరులో ముస్లిం ఓటర్ల శాతం అధికంగా ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నియామకం జరగడం విశేషం.

Updated Date - 2020-03-13T11:25:14+05:30 IST