సీఎంపై బురద చల్లడం తగదు
ABN , First Publish Date - 2020-03-27T10:10:32+05:30 IST
సీఎం జగన్ కరోనా వైరస్‌ను అరికట్టడంలో ఇతర రాష్ర్టాల కంటే మన రాష్ట్రంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రోజా
నగరి, మార్చి 26: సీఎం జగన్ కరోనా వైరస్‌ను అరికట్టడంలో ఇతర రాష్ర్టాల కంటే మన రాష్ట్రంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. గురువారం నగరి మున్సిపల్ కార్యాలయంలో మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత తరుణంలో ధైర్యం చెప్పాల్సింది పోయి లేని పోని భయాందోళనలను రేకిత్తించడం తగదన్నారు. ప్రతిపక్షనేత హోదాలో సలహాలు, సూచనలు చేయవచ్చు కానీ విమర్శలు కాదన్నారు. తెలంగాణలో కూర్చుని మొక్కుబడిగా ప్రెస్‌మీట్లు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు రేయింబవళ్ళు కష్టపడుతున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, ఎంపీడీవో రామచంద్ర, సీఐ మద్దయ్య ఆచారి, తహసీల్దార్ బాబు, వైసీపీ నాయకులు బాబురెడ్డి, రమే్‌షరెడ్డి పాల్గొన్నారు.