తిన్నది అరక్క ప్రభుత్వంపై నిందలా: ఎమ్మెల్యే రోజా

ABN , First Publish Date - 2020-07-28T10:48:25+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలను జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడు తిన్నది అరక్క హైదరాబాద్‌లో కూర్చుని ..

తిన్నది అరక్క ప్రభుత్వంపై నిందలా: ఎమ్మెల్యే రోజా

నగరి, జూలై 27: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలను జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడు తిన్నది అరక్క హైదరాబాద్‌లో కూర్చుని ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేయడం తగదని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. సోమవారం నగరిలో తన నివాసంలో 29మందికి రూ.12 లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా నియంత్రణకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, క్వారంటైన్‌లో ఉంటున్న బాధితులకు చక్కటి వైద్యం, నాణ్యమైన భోజన వసతి కల్పిస్తున్నారని చెప్పారు. 

Updated Date - 2020-07-28T10:48:25+05:30 IST