భూయజమానులకు ఎమ్మెల్యే భరోసా
ABN , First Publish Date - 2020-09-12T05:33:56+05:30 IST
తిరుపతి- కరకంబాడి రోడ్డులోని చెన్నాయగుంట లెక్కల దాఖల సర్వే నెంబరు 170/2లోని పది ఎకరాల్లో ఈ నెల 6న కొందరు ఆక్రమణకు యత్నించారు. ప్రహరీని కూల్చేశారు.

తిరుపతి (రవాణా), సెప్టెంబరు 11: తిరుపతి- కరకంబాడి రోడ్డులోని చెన్నాయగుంట లెక్కల దాఖల సర్వే నెంబరు 170/2లోని పది ఎకరాల్లో ఈ నెల 6న కొందరు ఆక్రమణకు యత్నించారు. ప్రహరీని కూల్చేశారు. దీనిపై ఆ భూమి యజమానులు శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణకారరెడ్డిని కలిశారు. దీనిపై ఎమ్మెల్యే తమకు భరోసా కల్పించారని న్యాయవాది కేఎస్ వాసు తెలిపారు. తిరుపతిలో భూకబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పారన్నారు. డీఎస్పీకి ఫోన్ చేసి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎఫ్‌ఐఆర్ పెట్టాలని సూచించారన్నారు. అనంతరం ఎమ్మెల్యేను వీరు సన్మానించారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో డాక్టర్ గంగిరెడ్డి, డాక్టర్ పార్థసారథిరెడ్డి, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ నరసింహరాజు, జీవరత్నంరెడ్డి, వెంకటశివారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.