మయూర షుగర్స్‌ ఆస్తులను వేలం వేస్తాం

ABN , First Publish Date - 2020-06-04T10:46:54+05:30 IST

మయూర షుగర్స్‌ నుంచి రైతులకు రావాల్సిన చెరకు బకాయిలను వసూలు చేసేందుకు 7వ నోటీసు జారీ చేసి ఆస్తులను వేలం ..

మయూర షుగర్స్‌ ఆస్తులను వేలం వేస్తాం

బుచ్చినాయుడుకండ్రిగ, జూన్‌ 3: మయూర షుగర్స్‌ నుంచి రైతులకు రావాల్సిన చెరకు బకాయిలను వసూలు చేసేందుకు 7వ నోటీసు జారీ చేసి ఆస్తులను వేలం వేస్తామని అసిస్టెంట్‌ షుగర్‌ కమిషనర్‌ జాన్‌విక్టర్‌, కలెక్టరేట్‌ అధికారిణి నాగప్రసూనలక్ష్మి తెలిపారు. బుధవారం వారు బుచ్చినాయుడుకండ్రిగకు చేరుకుని తహసీల్దార్‌ గణేష్‌తో 7వ నోటీసు విషయమై చర్చించారు. ఈ సందర్భంగా రైతులు వినతిప్రతం అందజేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం 28 నెలలుగా చెరకు బకాయిలు చెల్లించలేదన్నారు. అధికారులు మాట్లాడుతూ 7వ నోటీసు ఇచ్చిన 20 రోజుల తరువాత ఆస్తులను వేలం వేసి రూ.30 కోట్ల బకాయిలను చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

Updated Date - 2020-06-04T10:46:54+05:30 IST