మహిళా వర్సిటీ ఆర్థిక శాఖాధికారిగా మాల్యాద్రి
ABN , First Publish Date - 2020-11-13T05:55:01+05:30 IST
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవహారాల అధికారిగా డి. మాల్యాద్రిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
కలికిరి, నవంబరు 12: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవహారాల అధికారిగా డి. మాల్యాద్రిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఖజానా శాఖ సర్వీసుకు చెందిన మాల్యాద్రిని గతంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఏడాది డెప్యుటేషన్‌పై నియమించారు. అక్కడ గడువు ముగియగానే తిరిగి మాతృశాఖకు రప్పించారు. సెప్టెంబరు 2 నుంచి నియామకం లేకుండా అక్కడ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న మాల్యాద్రి వ్యవహారాన్ని ఖజానా శాఖ డైరెక్టర్ జనరల్ ప్రభుత్వానికి నివేదించడంతో ఆయన్ను పద్మావతి మహిళా వర్సిటీలో ఆర్థిక శాఖాధికారిగా తిరిగి డెప్యుటేషన్‌పై నియమించారు. ఏడాదిపాటు ఆయన ఈ డెప్యుటేషన్‌లో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ గురువారం ఆదేశాలు జారీచేశారు.