మలబార్‌లో స్టడ్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్
ABN , First Publish Date - 2020-09-12T05:35:26+05:30 IST
మలబార్‌లో స్టడ్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్

తిరుపతి (రవాణా), సెప్టెంబరు 11: తిరుపతిలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్‌లో స్టడ్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ ప్రారంభించినట్లు షోరూమ్ డైరెక్టర్ రిజీష్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఆకర్షణీయమైన చెవిదిద్దులు, జూకాలు, రింగులు తదితర ఆభరణాలను అందిస్తున్నామన్నారు. ఈ నెల 25 వరకు కొనసాగే ఈ వేడుకల్లో వజ్రాలు, రత్నాలు, ఇతర విలువైన రాళ్లు, పొదిగిన కర్ణాభరణాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఫెస్టివల్‌లో 22 క్యారెట్ల పాత బంగారు ఆభరణాలను మార్పిడి చేసినపుడు జీరో శాతం తగ్గింపును అందిస్తున్నామన్నారు. బంగారం స్వచ్ఛత నిర్ధారణకు క్యారెట్ విశ్లేషణ సదుపాయం షోరూమ్‌లో ఉందన్నారు.