త్వరగా 18 పురాణాలను అందుబాటులోకి తీసుకురండి

ABN , First Publish Date - 2020-12-31T04:59:36+05:30 IST

సంస్కృతంలోని 18 పురాణాలను త్వరగా తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తేవాలని పండితులను జేఈవో సదాభార్గవి కోరారు.

త్వరగా 18 పురాణాలను అందుబాటులోకి తీసుకురండి
పండితులతో మాట్లాడుతున్న జేఈవో సదా భార్గవి

తిరుపతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సంస్కృతంలోని 18 పురాణాలను త్వరగా తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తేవాలని పండితులను జేఈవో సదాభార్గవి కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో అష్టాదశ పురాణాలను అనువదిస్తున్న పండితులతో ఆమె సమీక్షించారు. పురాణాలను అనువదించే ప్రాజెక్టులో జరిగిన పురోగతిపై అభినందించారు. మత్స్య పురాణాన్ని త్వరగా ముద్రించి ఆవిష్కరించాలన్నారు. అగ్ని పురాణాన్ని పరిష్కరించటం  పూర్తయ్యాక, విష్ణు పురాణం, బ్రహ్మ పురాణంలోని రెండు భాగాలను పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో దక్షిణామూర్తిశర్మ, రామాంజులరెడ్డి, సముద్రాల లక్ష్మణయ్య తదితరులు పాల్గొన్నారు.


టీటీడీ కళాశాలల్లో భగవద్గీత నేర్పాలి 

టీటీడీ కళాశాలల్లో విద్యార్థులకు భగవద్గీతను, అన్నపూర్ణేశ్వరి శ్లోకాలను నేర్పించాలని జేఈవో సదా భార్గవి సూచించారు. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీ సంగీత నృత్య కళాశాలలను బుధవాం ఆమె తనిఖీ చేశారు. కొవిడ్‌ మార్గదర్శకాల అమలును పరిశీలించారు. విద్యార్థుల రికార్డులను ఐ.టి. విభాగంతో సమన్వయం చేసుకుని నాక్‌ గుర్తింపునకు తగ్గట్టు భద్రపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌, సుమతి, కృష్ణారెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2020-12-31T04:59:36+05:30 IST