సమగ్ర శిక్షా అకౌంట్స్‌ అధికారిగా మహబూబ్‌

ABN , First Publish Date - 2020-12-01T05:45:28+05:30 IST

చిత్తూరు జిల్లా సమగ్ర శిక్షా అకౌంట్స్‌ అధికారిగా ఎస్‌.మహబూబ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

సమగ్ర శిక్షా అకౌంట్స్‌ అధికారిగా మహబూబ్‌

కలికిరి, నవంబరు 30: చిత్తూరు జిల్లా సమగ్ర శిక్షా అకౌంట్స్‌ అధికారిగా ఎస్‌.మహబూబ్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖకు సంబంధించిన ట్రెజరీ అకౌంట్స్‌ విభాగానికి చెందిన మహబూబ్‌  కొంతకాలంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. సెలవు  ముగిసిన అనంతరం తనను చిత్తూరు జిల్లా సమగ్ర శిక్షా అకౌంట్స్‌ అధికారిగా నియమించాలని కోరారు. దీంతో అకౌంట్స్‌ అధికారిగా డిప్యుటేషన్‌పై నియమిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం సంవత్సరం మాత్రమే కొనసాగుతుంది. 

Updated Date - 2020-12-01T05:45:28+05:30 IST