సందడిగా సీటీఎం జాతర

ABN , First Publish Date - 2020-02-12T10:53:31+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఏటా మాఘమాసంలో గంగ జాతరలు ప్రారంభమవుతాయి. తొలి జాతరగా మదనపల్లె మండలం సీటీఎంలో మంగళవారం రాత్రి నలవీర గంగాభవానీ జాతర ప్రారంభమైంది.

సందడిగా సీటీఎం జాతర

మదనపల్లె టౌన్‌, ఫిబ్రవరి 11: జిల్లావ్యాప్తంగా ఏటా మాఘమాసంలో గంగ జాతరలు ప్రారంభమవుతాయి. తొలి జాతరగా మదనపల్లె మండలం సీటీఎంలో మంగళవారం రాత్రి నలవీర గంగాభవానీ జాతర ప్రారంభమైంది. బుధవారం ఉదయం వరకు జరిగే జాతరను ఉత్సాహంగా జరుపుకునేందుకు బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన సీటీఎంవాసులు స్వగ్రామాలకు చేరుకున్నారు. పలుప్రాంతాల నుంచి మహిళలు ఊరేగింపుగా తరలి వచ్చి గంగమ్మకు గెరిగెలు, దీలుబోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


ఆలయప్రాంతంలో వందలాది పొట్టేళ్లను భక్తులు బలిచ్చారు. వీటి చర్మం కొనుగోలుకు తమిళనాడు రాష్ట్రం రాణిపేట నుంచి పలువురు వ్యాపారులు రావడం విశేషం. మంగళవారం రాత్రి జరిగిన కోలాటం, చెక్కభజనల కళాకారుల ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ప్రత్యేకాలంకరణలో చాందినీబండ్లు బారులుతీరి రావడం ఆకట్టుకుంది. అమ్మవారి దర్శనార్థం జిల్లాతోపాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో తరలి రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు సీటీఎం వీధులు జనంతో కిటకిటలాడాయి. 

Updated Date - 2020-02-12T10:53:31+05:30 IST