మదనపల్లెను జిల్లాగా ప్రకటించేంత వరకు ఉద్యమం

ABN , First Publish Date - 2020-07-18T11:04:29+05:30 IST

మదనపల్లెను జిల్లాగా ప్రకటించేంత వరకు ఉద్యమం ఆపమని మదనపల్లె జిల్లా సాధన సమితి(ఎండీఎ్‌సఎస్‌) సభ్యులు స్పష్టం చేశారు...

మదనపల్లెను జిల్లాగా ప్రకటించేంత వరకు ఉద్యమం

మదనపల్లె టౌన్‌/అర్బన్‌/తంబళ్లపల్లె/రామసముద్రం, జూలై 17: మదనపల్లెను జిల్లాగా ప్రకటించేంత వరకు ఉద్యమం ఆపమని మదనపల్లె జిల్లా సాధన సమితి(ఎండీఎ్‌సఎస్‌) సభ్యులు స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణ చిత్తూరు బస్టాండు వద్ద ఎండీఎ్‌సఎస్‌ చేపట్టిన దీక్షలకు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ మద్దతు పలికారు. ఎండీఎ్‌సఎస్‌ కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ ఆధ్వర్యంలో స్థానిక జామియా మసీదు వద్ద ఆందోళన నిర్వహించారు.


నాయకులు రాటకొండ మధుబాబు, ఆర్జే వెంకటేష్‌, సహజీవన్‌బాబు, ప్రభాకర్‌, పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌, బందెల గౌతమ్‌కుమార్‌, నరేంద్రబాబు, శ్రీచందు, బయన్న, సూర్య పాల్గొన్నారు. మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలని తంబళ్లపల్లెలో కార్మిక, ప్రజాసంఘాల నాయకులు తహసీల్దార్‌ రవీంద్రారెడ్డికి వినతిపత్రం అందచేశారు. విజయ్‌ కుమార్‌, నజీర్‌, మణి, ఆనంద్‌, నాగరాజుశెట్టి, పాల్గొన్నారు. రామసముద్రం అంబేద్కర్‌ విగ్రహం వద్ద నేను సైతం -మదనపల్లె జిల్లా కోసం పోస్టర్లను ఎండీఎ్‌సఎస్‌ సభ్యులు ముత్యాల మోహన్‌, శేషు, నాగరాజు, శేఖర్‌, శంకర, వెంకటాద్రి ఆవిష్కరించారు. 

Updated Date - 2020-07-18T11:04:29+05:30 IST