మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి నష్టం

ABN , First Publish Date - 2020-05-13T10:42:58+05:30 IST

రాష్ట్రంలో మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు అమ్మకాలు పడిపోయి

మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి నష్టం

డిప్యూటీ సీఎం నారాయణస్వామి


పుత్తూరు, మే 12: రాష్ట్రంలో మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు అమ్మకాలు పడిపోయి నష్టం వస్తోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా తమ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేసి మహిళలకు కానుకగా అందిస్తామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఘటనకు కారణమైన ఫ్యాక్టరీకి తమ ప్రభుత్వం మద్దతు లేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-13T10:42:58+05:30 IST