పెరిగిన ప్రజా సంచారం

ABN , First Publish Date - 2020-03-27T09:59:40+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రారంభమైన తరువాత గురువారం తిరుపతిలో జనసంచారం కాస్త పెరిగింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు నిత్యావసరాలు కొనేందుకు అనుమతిచ్చారు.

పెరిగిన ప్రజా సంచారం

తిరుపతిలో కుటుంబసభ్యులతో సహా కూరగాయల కోసం వచ్చిన జనం 


తిరుపతి(నేరవిభాగం), మార్చి 26: లాక్‌డౌన్‌ ప్రారంభమైన తరువాత గురువారం తిరుపతిలో జనసంచారం కాస్త పెరిగింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు నిత్యావసరాలు కొనేందుకు అనుమతిచ్చారు. ఇక, నగరంలో 9 చోట్ల నిత్యావసరాలు, కూరగాయల విక్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఆయా ప్రదేశాలకు వెళ్లే క్రమంలో ప్రజల రాకపోకలు కనిపించాయి. కూరగాయలు కొనేందుకు కొందరు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో మార్కింగ్‌ వేసినా.. షాపుల ముందు మాత్రం గుంపులుగా కనిపించారు.


సామాజిక దూరానికి చరమగీతం పాడారు. తుడా రోడ్డులో మాత్రంలో మార్కింగ్‌లో వరుసగా వస్తూ కనిపించారు. కూరగాయల మార్కెట్లో రద్దీ కనిపించింది. మిగిలిన చోట్ల పెద్దగా జనం కనిపించలేదు. ఒంటి గంట తర్వాత పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రించారు. యువకులు బైక్‌లపై కనిపిస్తే స్టేషన్‌లకు తరలించి చిన్నపాటి శిక్షలతో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కాగా, మార్కెట్‌ వచ్చే ప్రజలు సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కవిసైఐనరు గిరీష కోరారు. గురువారం ఉదయం ఆయన మున్సిపల్‌ మార్కెట్లో పరిశీలించారు. ఒకేచోట మార్కెట్‌ ఉంటే ప్రజలు గుమిగూడటం వల్ల వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంటుందని పలుచోట్ల మార్కెట్లను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 

Updated Date - 2020-03-27T09:59:40+05:30 IST