ఆర్టీసీ ఉద్యోగులకు బీమా పథకం వర్తింపు

ABN , First Publish Date - 2020-11-13T07:10:01+05:30 IST

ఆర్టీసీ ఉద్యోగులకు ఈనెల ఒకటి నుంచే జీవిత బీమా పథకం వర్తించనున్నట్లు ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి తెలిపారు

ఆర్టీసీ ఉద్యోగులకు బీమా పథకం వర్తింపు

తిరుపతి (రవాణా), నవంబరు 12: ఆర్టీసీ ఉద్యోగులకు ఈనెల ఒకటి నుంచే జీవిత బీమా పథకం వర్తించనున్నట్లు ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం ఉద్యోగులకు అవగాహన కోసం జీవిత బీమా పథకంపై కరపత్రాలను విడుదల చేశారు. రెగ్యులర్‌ ఉద్యోగులుగా ఉండి 21-55 ఏళ్లలోపువారు అర్హులన్నారు. వేతనం నుంచి ప్రీమియం రికవరీ చేయబడుతుందని తెలియజేశారు. చిత్తూరు రీజియన్‌లో 5,684 మంది ఉద్యోగులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు. డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీరు శ్రీనివాసులు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ లక్ష్మీప్రసాద్‌, పీవో పార్థసారథి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T07:10:01+05:30 IST