చంద్రబాబు సస్పెన్షన్ దారుణం
ABN , First Publish Date - 2020-12-01T06:51:00+05:30 IST
చంద్రబాబును శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానీ పేర్కొన్నారు.

ఖండించిన టీడీపీ నేతలు నల్లారి కిషోర్, పులివర్తి నాని
తిరుపతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానీ పేర్కొన్నారు. వీరిద్దరూ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో చంద్రబాబు సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండించారు. రైతులకు సాయం చేయడం ప్రభుత్వానికి చేతగాకపోవడంతోనే టీడీపీ అధినేత రైతుల పక్షాన గళం విప్పాల్సి వచ్చిందన్నారు. తన నిర ్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా ప్రతిపక్ష నేతపై కక్షసాధింపు చర్యకు పాల్పడడం పిరికితనమన్నారు. జిల్లాలో పింఛా ప్రాజెక్టు దుస్థితి కి అధికారపార్టీ నాయకులు, అధికారుల తప్పిదమే కారణమని నల్లారి కిషోర్ ఆరోపించా రు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. అన్ని పథకాలకూ తేదీలు ప్రకటించే సీఎం.. రైతులకు నష ్టపరిహారం ఎప్పుడు అందిస్తామనేది మాత్రం ఎందుకు చెప్పలేదని ప్రశ్నిం చారు. చెరువులు, కుంటలు సమృద్ధిగా దొరికే ఇసుకను కూడా ప్రజలకు అందకుండా చేసిన ప్రభుత్వం శాసనసభలో సమాధానం చెప్పలేక ప్రతిపక్షనేతను సస్పెండు చేసిందని విమర్శించారు.