ఉపాధ్యాయుల సమస్యలు

ABN , First Publish Date - 2020-09-29T12:15:27+05:30 IST

tpt news

ఉపాధ్యాయుల సమస్యలు

చిత్తూరు సెంట్రల్‌, సెప్టెంబరు 28: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ చిత్తూరులో సోమవారం నుంచి యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరెడ్డి, రమణ అధ్యక్షతన నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు మద్దతు తెలిపారు. అవసరమైతే టీచర్లతో కలిసి పోరాడతానని ప్రకటించారు.


ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్దకు వచ్చిన డీఈవో నరసింహారెడ్డి టీచర్ల సమస్యలను తెలుసుకున్నారు. డీఎస్సీ 2001 నుంచి ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్‌, సీనియారిటీ జాబితా, సబ్జెక్టులవారీగా నెల రోజుల్లోపు విడుదల చేస్తానని లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. దాంతో దీక్షలు విరమిస్తున్నట్లు యూటీఎఫ్‌ నాయకులు ప్రకటించారు. నాయకులు రాధాకృష్ణ, సోమశేఖర్‌నాయుడు, రఘుపతిరెడ్డి, సూర్యప్రకాష్‌, సుధాకర్‌రెడ్డి, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T12:15:27+05:30 IST