నాడు-నేడు పనుల్లో మనమే లాస్ట్
ABN , First Publish Date - 2020-12-05T06:42:50+05:30 IST
‘నాడు- నేడు’ పనుల్లో రాష్ట్రంలోనే మన జిల్లా చివర్లో ఉందని జేసీ వీరబ్రహ్మం పేర్కొన్నారు.
ఎంఈవోలు, హెచ్‌ఎంల సమీక్షలో జేసీ వీరబ్రహ్మం
తిరుపతి(విద్య), డిసెంబరు 4: ‘నాడు- నేడు’ పనుల్లో రాష్ట్రంలోనే మన జిల్లా చివర్లో ఉందని జేసీ వీరబ్రహ్మం పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ ఉన్నతపాఠశాలలో శుక్రవారం ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లతో ఆయన సమీక్షించారు. డీవైఈవోలు, ఎంఈవోలు, స్పెషలాఫీసర్లు ప్రతిరోజూ పనులను పర్యవేక్షించి, ఈనెల 6వతేదీలోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పనులు పూర్తిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తయిన పనులకు యుద్దప్రాతిపదికన బిల్లులు అప్‌లోడ్ చేయాలన్నారు. మిగిలిన మొత్తాలకు అడ్వాన్స్ బిల్లులు అప్‌లోడ్ చేయాలని తెలిపారు. హెచ్‌ఎంలు, టీచర్లు సమయపాలన పాటించాలని, బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలని డీఈవో నరసింహారెడ్డి సూచించారు. డిజిటల్ బోధన, పాఠ్యప్రణాళికల తయారీకి మధ్యాహ్న సమయాన్ని వినియోగించుకోవాలన్నారు. బిల్లుల అప్‌లోడ్‌లో ఏర్పడిన విరామం వల్ల చివర స్థానంలో ఉన్నామని సమగ్రశిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ పి.వెంకట్రమణారెడ్డి పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక ద్వారా జిల్లాను మొదటిస్థానంలో నిలపతామన్నారు. ఈ సమావేశంలో తిరుపతి, పుత్తూరు డీవైఈవోలు సి.విజయేంద్రరావు, శేఖర్, సీఎంవో గుణశేఖర్‌రెడ్డి, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.